డేటింగ్‌పై ప్రభాస్ కామెంట్…యంగ్‌రెబల్‌స్టార్ ఫియాన్సీ…
బాహుబలి
ప్రచారం కోసం బాలీవుడ్ చుట్టేస్తున్నాడు ప్రభాస్. అక్కడ కూడా ఈ యంగ్‌రెబల్‌స్టార్‌ను మీడియా వాళ్లు మీ పెళ్లెప్పుడు, డేటింగ్‌లో ఉన్నారా అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారట. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ బాహుబలి కోసమే 300 రోజులు కష్టపడ్డాం. ఆ సమయంలో బాహుబలి తప్ప మరో ఆలోచన లేదు. ఇక డేటింగులు ఏం చేస్తాం అని చెప్పాడట.
తనకు బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎనర్జీ నచ్చుతుందని… దబాంగ్ తరవాత సల్మాన్‌కీ ఫ్యాన్ అయిపోయానని చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి జరగనుందని సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన తన సామాజికవర్గానికి చెందిన ఓ యువతిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment