లోఫర్ కూడా నష్టాలు మిగిల్చాడు
వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ చిత్రానికి మొదటి రోజు నుండే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కనీసం మాస్ ఏరియాల్లో నైనా కాసిన్ని డబ్బులు రాల్చుతుంది అని అనుకున్నారు కానీ మరీ డిజాస్టర్ అవుతుంది అని ఎవరూ అనుకోలేదు . ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది లోఫర్ . రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఏడున్నర కోట్లు మాత్రమే షేర్ వచ్చింది దాంతో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం ఖాయమైపోయింది ఎందుకంటే ఈనెల 24 న గోపీచంద్ సౌఖ్యం రిలీజ్ అవుతుండగా ఆ మరుసటి రోజు మరో మూడు చిత్రాలు కూడా వస్తున్నాయి దాంతో లోఫర్ ని అన్ని ఏరియాల్లో పీకేయడం ఖాయమైంది .
No comments:
Post a Comment