మెగాపవర్ స్టార్ కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్ 150వ సినిమా
ఎట్టకేలకు మెగా అభిమానులకు ఓ శుభవార్త లభించింది. చిరంజీవి 150వ సినిమా ఖరారు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతుందంటూ మెగాస్టార్ ఊరించి ఆశపెట్టి, అభిమానులను నిరాశ పరిచారు. కానీ అభిమానులు మాత్రం నిరాశ చెందకుండా చిరంజీవి 150వ సినిమా కోసం ఇంకా ఆత్రంగా ఎదురుచూస్తూనే వున్నారు.
మెగాస్టార్ తో 150వ సినిమా తీయడానికి చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ కేవలం ఇద్దరు దర్శకులే ఫైనల్ అయ్యారు. అందులో ఒకరు టాలీవుడ్ ఎనర్జీటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాగా.. మరొకరు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్. చిరంజీవి 150వ సినిమాను పూరీ దర్శకత్వంలో దాదాపు ఖరారు అయ్యింది. ఆ ప్రాజెక్టుకు ‘ఆటోజానీ’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయే రేంజులో డిజైన్ చేసిన పూరీ.. సెకండ్ హాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకొని డిజైన్ చేసి వుంటే ఇప్పటికే ‘ఆటోజానీ’ షూటింగ్ చివరి దశకు చేరి వుండేది.

ఆటోజానీ’ కోసం పూరీ సిద్ధం చేసిన స్క్రిప్టులో ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టును ఆపేసారట. కానీ ఈ విషయంలో ఏమైనా సూచనలు ఇచ్చి వుంటే తాను సెకండ్ హాఫ్ ను మరింత బాగా డిజైన్ చేసి వుండేవాడినని పూరీ చెప్పుకొచ్చాడు. కానీ చిరంజీవి గారు ఎలాంటి ఆదేశాలు చేయకుండా ఈ ప్రాజెక్టును పక్కనపెట్టేయడం తనకు చాలా బాధేసిందని పూరీ చెప్పుకొచ్చాడు. దీంతో ‘ఆటోజానీ’ అటకెక్కిసిందని అర్థమయ్యింది.
ఇక చిరంజీవిని సరైన విధంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగల దర్శకుల జాబితాలో వున్న మరో దర్శకుడు వి.వి.వినాయక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఠాగూర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని అందరూ భావించారు. అయితే తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేయాలని చాలారోజుల క్రితమే సన్నాహాలు చేసారు. కానీ ఏదైనా కొత్త కథ దొరుకుతుందేమోనని ఇంతకాలం ఎదురుచూసారు.

కానీ చిరంజీవి 150వ సినిమా చాలా ఆలస్యం అవుతుండటంతో ఇక ‘కత్తి’కే ఫిక్సయ్యారు. తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన తండ్రి చేయబోయే 150వ సినిమా తమిళ ‘కత్తి’ రీమేక్ అని, ఆ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని తెలియజేసారు. త్వరలోనే ఈ విషయాన్ని చరణ్ ఓ అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘కత్తి’ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్లుగా స్ర్కిప్ట్ డిజైన్ చేస్తున్నట్లుగా తెలిసింది.
చిరంజీవి చేయబోయే ఈ 150వ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగాఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ‘కత్తి’ రీమేక్ లో మెగాస్టార్ ఎలా కనిపిస్తాడో, ఎలాంటి విజయం సాధిస్తాడో త్వరలోనే తెలియనుంది.

No comments:
Post a Comment