Thursday, 24 December 2015

నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్ ఫిక్స్

నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్ ఫిక్స్


సుకుమార్ దర్శకత్వంలో , ఎన్టీఆర్ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో ' చిత్రానికి వస్తున్న రూమర్స్ అన్ని ఇన్ని అని కాదు. ఇప్పుడా రూమర్స్ కి దాదాపు  బ్రేక్ పడినట్లే , ఈ చిత్ర బృందం ఈ రోజే ఆడియో రిలీజ్ పోస్టర్స్ ని విడుదల చేశారు. ఈ చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్ లో శిల్పకళ వేదిక పై ఈ నెల డిసెంబర్ 27 న  విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో రైట్స్ ను జంగిల్ మ్యూజిక్ వారు రికార్డ్ ధరకు కొన్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13 న  గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.   

No comments:

Post a Comment