plz.. visit the side ads.. for best deals..
‘సైజ్ జీరో’ ఆడియో ఫంక్షన్‌లో హాస్య నటుడు ఆలీ తనపై చేసిన వ్యాఖ్యలపై అనుష్క బాధపడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అలీ చేసిన వ్యాఖ్యలకు అందరి ఎదుట ఏడ్వలేక నవ్వినా.. ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర అనుష్క ఈ విషయంపై తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాహుబలి పార్ట్-2′ కోసం రెడీ అవుతున్నఅనుష్క తన బాధను ‘భల్లాలదేవుడు’ రానా దగ్గర కూడా వ్యక్తం చేసిందట! దీంతో, తన స్నేహితురాలిపై చెత్త వ్యాఖ్యలు చేసిన అలీకి ఫోన్ చేసి రానా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. మరోసారి పబ్లిక్ ఫంక్షన్లలో ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేయవద్దని.. హద్దుల్లో ఉండి ఎంతవరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడితే బాగుంటుందని అలీ కి రానాకు గట్టిగా చెప్పాడని ఫిలింనగర్ లో హాట్ హాట్‌గా వార్తలు వినపడుతున్నాయి. కాస్త ఘాటుగానే.. పరుష పదజాలం ఉపయోగించే రానా ఆలీపై ఫైర్ అయ్యాడని సమాచారం. రానా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా ఫ్యామిలీ వారసుడు కావడంతో.. తదుపరి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని సినీ వర్గాలు కంగారుపడుతున్నాయి. అలీ మరో మాట మాట్లాడకుండా కామ్ అయిపోతే ఈ వివాదం సద్దుమణిగిపోతుందని.. అలా కాకుండా అతడు కూడా రెచ్చిపోతే వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని సినీ ప్రముఖులు పలువురు ఆఫ్ ది రికార్డ్ అభిప్రాయపడుతున్నారు
No comments:
Post a Comment