Sunday, 10 January 2016

రూ.335 కే కంప్యూటర్..!

cheap-computer-2721

ప్రపంచంలోకెల్లా అతి తక్కువ ధరలో, అతి చిన్న పరిమాణంలో కంప్యూటర్ ను ప్రఖ్యాత కంపెనీ ‘రాస్ప్ బెర్రీ పై’ రూపొందించింది. దీని ధర కేవలం 5 అమెరికన్ డాలర్లు మాత్రమే.. అంటే కేవలం రూ.335 మాత్రమే! ఈ న‌యా ఆవిష్క‌ర‌ణ‌కి ‘రాస్ప్ బెర్రీ పై జీరో’ అని పేరు పెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన రాస్ప్ బియన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ బుల్లి కంప్యూటర్ పనిచేస్తుంది. కేవలం హెచ్ డీ ఎంఐ పోర్టు కలిగిన స్ర్కీన్, యూఎస్బీ , మౌస్, కీబోర్డు ఉంటే చాలు దీన్ని అన్ని కంప్యూటర్లలాగానే ఉపయోగించవచ్చు.
ప్రస్తుతం అమెరికా, యూకే దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బుల్లి కంప్యూటర్.. మ‌రికొద్ది రోజుల్లో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించనుంది. వన్ గిగా జీహెచ్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 1080 రిజ‌ల్యూషన్ వంటి ఫీచర్లు కలిగిన ఈ కంప్యూటర్ మెమొరీని మ‌న‌కు అనుగుణంగా.. అవ‌స‌ర మయ్యే విధంగా.. పెంచుకోవచ్చు. ఈ బుల్లి కంప్యూటర్ ఇలా మార్కెట్లోకి వచ్చిందో లేదో అలా.. అమ్ముడైపోయింది. ప్రస్తుతానికి కేవలం 10 వేల యూనిట్ల‌ను మాత్రమే రూపొందించిన రాస్ప్ బెర్రీ పై సంస్థ .. మ‌రికొద్ది రోజుల్లో పెద్ద మొత్తంలో వీటిని రూపొందిస్తామని తెలిపింది.
please share it..

4 comments:

  1. Sir I want this lap.sir 7842609508 cl me sir

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. i want this system please call to tnis number 09701217143

    ReplyDelete
  4. I want this system pls call me this is my number 9742953894

    ReplyDelete