అసోంలో.. కరీంగంజ్ జిల్లాలో.. ఉన్న ఓ గ్రామీణ ఆస్పత్రిలో.. విచిత్రకర రీతిలో అవినీతి చోటు చేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న లిలీ బేగం కాసుల కోసం కక్కుర్తిపడింది.ఆస్పత్రిలో ప్రసవించే బాలింతలకు ప్రోత్సహకాలు అందించే విభాగానికి ఇన్‌ఛార్జి కావడంతోఆమె గారి పని మరింత సులువైంది.వివరాల్లోకి వెళ్తే… ప్రభుత్వ గ్రామీణ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు ప్రోత్సాహకం కింద 500 రూపాయలను అసోం ప్రభుత్వం అందిస్తోంది. లిలీ బేగం మాత్రం తమ ఆస్పత్రిలో.. మొత్తం 160 డెలివరీలు జరిగినట్టు రికార్డుల్లో చూపించి, వాటిలో సగం అంటే 80 ప్రసవాలు తనవేనని దొంగ లెక్కలు చూపించి, రూ.40 వేలు కాజేసింది.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు.డబ్బుకు లోకం దాసోహం అని తెలుసు. కానీ మరీ! ఇంతగా దాసోహం అని ఎవ్వరూ అనుకోరు కదూ!
please share it..
No comments:
Post a Comment