పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేనే, ఆ మూవీ రిలీజ్ కి ముందుగా ఏదొక గొడవలు క్రియేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా ఆ గోడవలు ఏర్పడతాయి. మరి కొన్ని సందర్భాలలో చిత్ర యూనిట్ కావాలని గొడవలు క్రియేట్ చేస్తాయి. అయితే ఆ మూవీకి సంబంధించిన గొడవ ఎందుకు ఏర్పడిందనేది, ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారికి బాగా తెలుసు. ఇక తాజాగా ఎన్టీయార్ హీరోగా వస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో సైతం ఓ గొడవలో ఇరుకున్నదనే విషయం తెలిసిందే. ఈనెల 13న సంక్రాంతి సందర్భంగా నాన్నకు ప్రేమతో సినిమాని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ విషయంలో ఓ వర్గానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ పోస్టర్ లోని కొన్ని మత సంబంధిత అంశాలు.. ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంట. తక్షణమే ఆ పోస్టర్ ను తొలగించాలని మీలాద్ కమిటీ ఆద్వర్యంలో ముస్లిం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతే కాకుండా మాసాబ్ ట్యాంక్ వద్దకు వెళ్లి సెన్సార్ బోర్డ్ సభ్యులకు వినతిపత్రం కూడ అందజేశారు. అంతటితో ఆగకుండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు నమోదు చేశారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యలు క్లారిటి ఇవ్వకుండా రిలీజ్ చేసినా, ఆ సన్నివేశాలను..ఆ పోస్టర్ ని తొలగించకపోయినా బాగుండదంటూ చాలా క్లారిటిగా వారు ఉన్నారంట. అయితే ఈ గొడవని ఎవరో కావాలని క్రియేట్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ కి రిపోర్ట్ వచ్చినట్టుగా మాటలు బయటకు వస్తున్నాయి.
please share it..
No comments:
Post a Comment