టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలతో వివాదంతో పాటు ఇతరత్రా అంశాల్లో వార్తల్లో ఉంటున్న ఆయన తాజాగా కోడి పందాలకు ఓ సరికొత్త డెపినెషన్ ఇచ్చి మరోసారి వార్తలకెక్కారు. కోడి పందాలు ఓ సంప్రదాయ క్రీడ అని ఈ పందాలతో గ్రామాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు జూదం కాదని, పండక్కి పందాలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాల అభివృద్ధి కోసం ధారాళంగా విరాళాలు అందిస్తున్నారన్నారు. జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి 12 వేల మంది ఎన్ఆర్ఐ లు ముందుకొస్తున్నారని గుర్తు చేశారు.
కోడిపందాలను అధికారికంగా నిర్వహించే విషయమై జీవో తీసుకొస్తామని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణ దశాబ్దాలుగా వస్తోన్న సంప్రదాయమన్నారు. వేల కోట్ల వ్యయంతో గుర్రపు పందాలు నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నప్పుడు కోడి పందాలకు అభ్యంతరం దేనికని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాలు వీటిని నిలుపుదల చేయడం సరికాదన్నారు. అయితే కోర్టులను తాను గౌరవిస్తున్నానన్నారు. కోడిపందాల వల్ల పట్టణ వాసులకు గ్రామీణ వాతావరణం అలవాటు అవుతుందని విదేశీయులు, స్నేహితులు కోడిపందాలను తిలకించి ఆనందం పొందుతారన్నారు.
please share it..
No comments:
Post a Comment