Sunday, 10 January 2016

కౌగిలింత‌కు అంత సీనుందా ?

4455445450

భార్య భ‌ర్త‌ల కౌగిలింత‌ల వెన‌క చాలా క‌థే ఉంద‌ట‌. కౌగిలింత‌లు దాంప‌త్య జీవితంలో ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కౌగిలింత‌లు మ‌గువ‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తాయ‌ని నార్త్ కారోలినా యూనివర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు. వీరి ప‌రిశోధ‌న‌ల్లో చాలా ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. భార్య‌భ‌ర్త‌ల్లో అల‌స‌ట ఎక్కువైన‌ప్పుడు…ప్ర‌శాంత‌త లేన‌ప్పుడు ఆలింగాన్ని మించిన మందు లేద‌ని వారు చెపుతున్నారు. భాగస్వామిని కౌగలించుకోవ‌డంలో కలిగే మధురానుభూతిని మాటల్లో చెప్పలేమ‌ట‌. కౌగిలింత సమయంలో జంట శరీరంలోని హార్మోన్ల కదలికలను, రక్త పోటును పరిశీలించారు. మగువలలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు కార్టిసాల్ కదలికలు తగ్గడం గమనించారు. రక్తపు పోటు స్థాయి సైతం మెరుగుగా ఉండటం కనుగొన్నారు. అదే ప్రేమికుడ్ని ఆలింగనం చేసుకోవడం మగవారిలో కన్నా మగువలలో స్థిరమైన స్థితి, అంటే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన స్థితికి దారి తీస్తుందని వెల్లడైంది.

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధి డా. చర్మినే గ్రిఫ్ఫిత్స్ ప్రకారం ఆక్సిటోసిన్ ప్రభావం మగవారి హృదయంపై కన్నా మగువుల గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సహేతుక భావోద్వేగాలు వారి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి కారణం కాగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జంటలు షాపింగ్ కు వెళ్ళినప్పుడు పరస్పరం చేతులు కలుపుకొని నడవడం, నిద్ర పోయే సమయంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కొద్ది సేపు గడపడం, తీరుబడిగా ఉన్నప్పుడు ఒకరి ఒడిలో మరొకరు కొద్ది సేపు ఆత్మీయంగా గడపడం … ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు పరప్సరం హార్ట్ టచ్ చేసుకొనే విధంగా గడిపితే వారి జీవితాల తీరే మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
please share it..

No comments:

Post a Comment