జీవితంలో శృంగారం ముఖ్యమే.. ఒక క్రమపద్ధతిలో శృంగారంలో పాల్గొనేవారు ఆరోగ్యంగా ఉంటారని కూడా చాలా పుస్తకాల్లో చదివాం. అయితే ప్రకృతి సిద్ధంగా శృంగార జీవితం గడిపే వారిని స్ట్రెయిట్ అని, స్వలింగ సంపర్కం ఇష్టపడేవారిని హోమో సెక్సువల్ అని అంటారనే విషయం తెలిసిందే. అయితే ఒక స్త్రీ లేదా పురుషుడు తమ వర్గాలతోనే శృంగారానికి ఇష్టపడడాన్ని “బై సెక్సువాలిటీ” అంటారు. ఈ తరహా వ్యక్తులు ప్రస్తుతం అమెరికా సమాజంలో ఎక్కువైపోతున్నారట. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటస్టిక్స్ ఇటీవల చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
సర్వేలో 18 నుంచి 44 మధ్య వయసు గల వారు పదివేల మంది పాల్గొన్నారట. నేరుగా ఓ వ్యక్తికి సమాధానం చెప్పే పద్ధతిలో కాకుండా కంప్యూటర్ ద్వారా జవాబు చెప్పే పద్ధతిలో ఈ ఇంటర్వ్యూ నిర్వహించారట. ఇందులో సెక్స్ గురించి అడిగిన ప్రశ్నకు 5.5 శాతం మంది మహిళలు తాము బై సెక్సువల్స్ అని చెప్పారట. అలాగే 2 శాతం మంది పురుషులు తాము బై సెక్సువల్స్ అని అంగీకరించారట. 2006లో జరిపిన సర్వేలో 3.9 శాతం మంది మహిళలు, 1.2 శాతం మంది పరుషులు బై సెక్సువల్స్ అని చెప్పుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. కొంతమంది మహిళలు తాము బై సెక్సువల్స్ కాకపోయినా జీవితంలో ఒక్కసారైనా సాటి స్త్రీతో శృంగారంలో పాల్గొన్నామని 17.4 శాతం మంది మహిళలు సమాధానమిచ్చారట. అలాగే 6.2 శాతం మంది పురుషులు కూడా సాటి మగవాళ్లతో ఒక్కసారైనా సెక్స్ చేశామని ఒప్పుకున్నారట.
please share it..
No comments:
Post a Comment