Sunday, 10 January 2016

బన్నీ మరీ ఓవర్ చేస్తున్నాడు?

058045105

స్టార్ హీరోలు ఒక్కోసారి ఓవర్ చేస్తున్నారనే వార్తల వింటుంటాం. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అర్జున్ విషయంలో ఏకంగా చూస్తున్నాం. ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం సరైనోడు. దర్శకుడు భోయపాటి శ్రీనుతో అల్లుఅర్జున్ చేస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం సరైనోడు. ఈ సినిమాలో భోయపాటి, బన్నీ చేత మాస్ యాక్షన్ చేయిస్తున్నాడు. ఇక కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ భుజానికి కొద్దిపాటి గాయమైంది. అయితే ఆ గాయం పూర్తిగా మానేవరకూ డాక్టర్లు ఈ హీరోని విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అల్లుఅర్జున్ మాత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీంతో డైరెక్టర్, అల్లఅర్జున్ ని ఉద్ధేశించి ఓవర్ గా అనిపించటం లేదా? అని అడిగాడంట. నిజానికి సినిమా అనేది జీవితం అయినప్పటికీ, దానికి తగ్గట్టుగా స్టార్స్ సైతం ఆరోగ్యసంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. షూటింగ్ లో గాయాలు ఏర్పడితే ఆరోగ్యం కుదట పడిన తరవాత షూటింగ్ లో పాల్గోవాలి కాని, ఇలా గాయాలతో వచ్చి పాల్గొని సాధించేది ఏముంటుంది? అంటు అభిమానులు సైతం గాయం తగ్గిన తరవాత షూటింగ్ లో పాల్గొవాలని అల్లుఅర్జున్ కి చెబుతున్నా, తను వినటం లేదంట. దీంతో అందరూ అల్లుఅర్జున్ ఓవర్ చేస్తున్నాడని అంటున్నారు.
please share it..

No comments:

Post a Comment