సమయం : సాయంత్రం నాలుగు గంటలు. స్థలం : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని సాగర్ సొసైటీ చౌరస్తా. పేరొందిన ప్రముఖ బైక్ షూరూం. ఇంతలో అక్కడికో వ్యక్తి చేరుకున్నాడు.టిప్ టాప్ గా తయారై వచ్చి, షోరూంలోకి ఎంటరయ్యాడు.హై- ప్రొఫైల్ సొసైటీకి చెందినవాడిలా.. బిల్డప్ ఇచ్చాడు.తన పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు.తాను నెలకు లక్షన్నర సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని చాలా సాఫ్ట్ గా చెప్పాడు.ఓహో! అనుకున్నారు..నిజమని నమ్మారు అక్కడిస్టాఫ్.ఇంకేముంది క్రెడిట్ కార్డులు చూపించి టెస్ట్ రైడ్ పేరుతో 6లక్షల రూపాయల విలువైన హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్-750 ఉడాయించాడు.అతడిచ్చిన సెల్‌నంబర్ కు కాల్ చేస్తే స్విచాఫ్. ఎంత వెతికినా దొరకలేదు అతడి కేరాఫ్. చేసేది లేక.. ఊసురోమంటూ..షోరూం యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు బృందం నేతృత్వంలో గాలింపు కొనసాగుతోంది. ఇంతకీ ..! గాలి గాడి ఆచూకీ దొరుకుతుందో లేదో..!
please share it..
No comments:
Post a Comment