ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజం సమస్యల్లో చిక్కుకుంది.సమీక్షకుల పుణ్యమాని నష్టాలను చవిచూస్తోంది.దీంతో సైట్లో తప్పుడు రివ్యూలు రాస్తున్నారని అభియోగం నమోదు చేస్తూ..1,114 మంది పై కేసులు పెట్టి సంచలనానికి తెరలేపింది.వీరంతా పలు ప్రొడక్టుల పనితీరు బాగాలేదంటూ, ఇతర కస్టమర్లను పక్కదారి పట్టించేలా సమీక్షలు రాస్తున్నారని ఆరోపించింది. జాన్ డోయిస్ అనే గుర్తు తెలియని అమెరికన్, తాను ఐదు డాలర్లతోనే తప్పుడు రివ్యూలు రాస్తానని ‘ఫైవెర్ డాట్ కాం’ ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని తెలిపింది.ఇతను ఎవరన్నది తేల్చేందుకు దర్యాఫ్తునకు పోలీసులను అనుమతించాలని కోర్టును కోరింది. ఫేక్ రివ్యూలు రాస్తున్న వారందరి ఐడీలనూ కోర్టుకు అందజేసింది.తప్పుడు రివ్యూలను రాస్తున్న వారిలో అమేజాన్ నుంచి ప్రొడక్టులను కొనుగోలు చేసిన వారూ ఉన్నారని తెలుస్తోంది. పలు వెబ్ సైట్లు వివిధ రకాల ప్రొడక్టులపై తప్పుడు ప్రచారం సాగించేందుకు సహకరిస్తూ, అవి బాగా లేవని చెప్పే రివ్యూయర్లను విక్రయిస్తుంటాయి.ఈ తరహా ప్రచారం పెరగడం తమ వ్యాపారానికి నష్టం కలిగిస్తోందని, వీరి సమీక్షలు నమ్మి పలువురు కస్టమర్లు తమకు దూరమవుతున్నారన్నది అమేజాన్ ఆవేదన.
please share it..
No comments:
Post a Comment