Sunday, 10 January 2016

పవన్ మూవీకి బిజినెస్ కావటం లేదా?

tt0450120

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. అయితే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ విషయంలో, ఇది చాలా స్లోగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం పవన్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత వస్తున్న పవన్ సినిమా కావటంతో, ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్‌ను ఆధారం చేసుకొని వస్తున్న కథ సర్ధార్ గబ్బర్ సింగ్ కావడంతో..అభిమానుల్లోనూ ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్, టీజర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే లోగుట్టు ప్రకారం ఈ మూవీకి బిజినెస్ అంతగా హైప్ క్రియేట్ అవ్వటం లేదని అంటున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజైషన్ ఓవర్ గా ఉందని అంటున్నారు. బాక్సాపీస్ పరంగా ఈ మూవీ గబ్బర్ సింగ్ సాధించినంత సక్సెస్ ని సాధించలేకపోవచ్చని అంటున్నారు. దీంతో నిర్మాత ముందు జాగ్రత్త పడి…ఈ మూవీపై పాజటివ్ రిపోర్ట్ వచ్చే విధంగా పలు ప్రెస్ మీట్స్ పెట్టేందుకు సిద్ధం అయ్యాడంట. అందులో భాగంగానే తాజాగ ఓ ప్రెస్ మీట్ పెట్టి మూవీ గురించి ఆకాశానికి ఎత్తేశాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారని, అభిమానులకు ఏమేం అందించాలో ఆయనకు సరిగ్గా తెలుసని చెబుతూ శరత్, పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
please share it..

No comments:

Post a Comment