Monday, 28 December 2015

బాలయ్య కంటే చిరు, వెంకి ముద్దు అంటున్న జూనియర్ ఎన్టిఆర్ మరోసారి అభిమానులని ఘోరంగా అవమానించారు.

బాలయ్య కంటే చిరు, వెంకి ముద్దు అంటున్న జూనియర్ ఎన్టిఆర్ మరోసారి అభిమానులని ఘోరంగా అవమానించారు.



తారక్ తన రాబోయే సినిమా నాన్నకు ప్రేమతో ఆడియో వేడుక శిల్పకళావేదికలో ఘనంగా చేశారు.అయితే అక్కడికి వెళ్ళిన నందమూరి అభిమానులని మరోసారి ఘోరంగా అవమానించారు.ఆడియో వేడుకలో భాగంగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యాంగ్ తరంగ్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి ఇటివలే స్వర్గస్తులైన ప్రముఖ రచయిత సత్యమూర్తి గారిని పొగుడుతూ అయన గోప్పతన్నాన్ని చాటి చెప్పుతూ వీడియొ ఒకటి ప్రదర్శించారు.ఐతే ఆ వీడియోలో సత్యమూర్తి గారు తీర్చిద్దిన చిరంజీవి అభిలాష,వెంకి నటించిన చంటి చిత్రాలలోని క్లిప్పింగ్స్ వేసినప్పటికీ నందమూరి అందగాడు,స్వయానా తారక్ బాబాయ్ అయిన బాలయ్యబాబుకి సత్యమూర్తి గారు రచించిన మూడు సూపర్ హిట్ చిత్రాలు నారి నారి నడుమ మురారి,బంగారు బుల్లోడు,భలే దొంగ చిత్రాలకి సంబందించిన క్లిప్పింగ్స్ ఒక్కటి వేయకపోవడంతో నందమూరి అభిమానులు షాకయ్యారు.పైగా వేదిక మీద మాట్లాడిన వాళ్ళలో తారక్ తో సాన్నిహిత్యం ఉన్నవారందరూ తారక్ అభిమానులు అంటున్నారే తప్ప నందమూరి అభిమానులు అనడానికి ఇష్టపడలేదు.అయితే తారక్ గత కొంత కాలంగా పోకడలకి పోతూ నందమూరి వారితో విభేదిస్తున్న సంగతి తెలిసిందే.ఐతే ఇదంతా తారక్ తెలిసి చేయించాడా?లేక తారక్ ప్రమేయం లేకుండానే జరిగిపోయిందా అనేది పక్కన పెడితే నందమూరి అభిమానులు మాత్రం నందమూరి హీరోలందని కలిపి ఒకే చిత్రంలో చూడలని వారు మళ్ళి కలిసిపోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు.కాని ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ చూశాక నిజమైన నందమూరి అభిమానులు తారక్ ఎందుకిలా చేస్తున్నాడని బాధపడుతున్నారు.

No comments:

Post a Comment