ఇండస్ర్టీకి షాక్ ఇస్తున్న సర్దార్ ఫ్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు సినిమాకు
సింహాభాగం కలెక్షన్స్ ఇచ్చే చోటు నైజాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో మిగతా హీరోలకన్నా ఎక్కువ కమాండ్ ఉందనే చెప్పాలి. గబ్బర్ సింగ్ తో 20 కోట్లు, అత్తారింటికి దారేదితో 24 కోట్ల వరకు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ మిగిలిన హీరోలపోల్చితే నైజాంలో ఒక అడుగు ముందే ఉన్నాడు. తన కేరీర్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ లాంటి హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఇప్పటినుండే భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఎలాగు బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో సర్దార్ సినిమా బిజినెస్‌కు కూడా మంచి క్రేజ్ వస్తోంది. ఫిల్మ్ నగర్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నైజాంలో సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఇది ఇప్పటివరకు విడుదల అయిన తెలుగు సినిమాల్లో రెండో అత్యధిక రేటు. ఇంతకుముందు బాహుబలికి 22.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు పవన్ బాహుబలి తరువాత అత్యధిక రేటు దక్కించుకున్న రెండో హీరో అయ్యాడు. టాలీవుడ్‌లో నాన్ బహుబలి సినిమాల్లో టాప్ ప్లేసులో ఉన్న శ్రీమంతుడు కూడా అక్కడ కేవలం రూ.14 కోట్లకు అమ్ముడైతే ఇప్పుడు సర్దార్ ఏకంగా ఈ రేటుకు అమ్ముడవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
That is power stamina
ReplyDeleteThat is power stamina
ReplyDeleteJai pawanism ✊ ✊ ✊
ReplyDelete