తారక్ బాలివుడ్ స్టారయ్యాడు..?
తారక్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తారక్ కు ఇది 25 వ చిత్రం. అయితే, కొన్ని రోజులుగా స్పెయిన్ లో షూటింగ్ చేసుకుంటుండటంతో అక్కడి మీడియాలో కూడా తారక్ ఫేమస్ అయ్యారు. ఇక,స్పెయిన్ మీడియా నాన్నకు ప్రేమతో టీం ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ లో సుకుమార్, తారక్ కు అనేక విషయాలు చెప్పారు. స్పెయిన్ లో షూటింగ్ చేయడం అద్బుతంగా ఉందని చెప్పారు.
ఇక, మీడియా ప్రతినిధులు నాన్నకు ప్రేమతో నటించాలనుకుంటే.. లొకేషన్ వచ్చేయమని సుకుమార్ చెప్పాడట. అంతే.. తారక్ గురించి, సుకుమార్ గురించి స్పెయిన్ మీడియాలో వార్తలు వచ్చేశాయి. తారక్ ను ఏకంగా బాలివుడ్ స్టార్ అని రాసుకోచ్చాయి. షూటింగ్ మరికొన్ని రోజులలో పూర్తిచేసి.. హైదరాబాద్ ల వచ్చాక సాంగ్ షూట్ చేస్తారు. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. జనవరి 13 న సినిమా రిలీజ్ చేయడానికి టీం సన్నాహాలు చేస్తున్నది.
No comments:
Post a Comment