Wednesday, 9 December 2015

తెలుగులో రానా-అక్ష‌య్‌కుమార్ మ‌ల్టీస్టార‌ర్‌

తెలుగులో రానా-అక్ష‌య్‌కుమార్ మ‌ల్టీస్టార‌ర్‌


Rana-akshay kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్‌, ద‌గ్గుపాటి రానా క‌లిసి ఓ తెలుగు మ‌ల్టీస్టార‌ర్  సినిమాలో న‌టిస్తున్నారు.ఈ సినిమాను రానా తన బాలీవుడ్ మిత్రుడు అక్షయ్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్నాడు. బేబీ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. రానా అక్షయ్ కలిసి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో సినిమా నిర్మించాలని నిర్ణయించుకోవడం విశేషమే. వీళ్లిద్దరూ ‘పోస్టర్ బాయ్స్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. 
       
                 ఈ మూవీకి గోపీ గణేష్ దర్శకత్వం వహించనుండగా డార్లింగ్ స్వామి స్క్రిప్టు సమకూరుస్తున్నాడు. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు గురించి రానా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఓ మరాఠీ సూపర్ హిట్ సినిమాకు రీమేకే ఈ పోస్టర్ బాయ్స్ అని కూడా రానా చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు న‌టీన‌టులు ఎంపిక జ‌రుగుతోంది. టాలెంట్ వాళ్లు త‌మ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను సంప్ర‌దించాల‌ని వారు కోరాడు.

No comments:

Post a Comment