ప్రభాస్ రాజమౌళి లకి మరీ అంత తక్కువా..
తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన బాహుబలి సినిమా కి పనిచేసినందుకు ప్రభాస్ కి దక్కిన పారితోషికం ఎంత? ఇంత గొప్ప విజయానికి మూల కారకుడు రాజమౌళి కి ఎంతిచ్చారు? ఈ ప్రశ్నలకి సరైన సమాధానం తెలిసింది 10 మందికే. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, రాజమౌళి, ప్రభాస్ వారి కుటుంబ సభ్యులకి మాత్రమే కరెక్ట్ ఫిగర్ తెలుసు. మిగతాదంతా గాలి కబుర్లే. అయితే, తాజాగా ఫోర్బ్స్ పత్రిక రాజమౌళి, ప్రభాస్ ల రెమ్యునరేషన్ గురించి తన ఆర్టికిల్ లో పేర్కొంది. రాజమౌళి కి26 కోట్లు, ప్రభాస్ కి20 కోట్లు పారితోషికంగా ఇచ్చారని ఫోర్బ్స్ పేర్కొంది. ప్రభాస్ ఈ సినిమా కోసం రెండేళ్ళు పైగా కష్టపడ్డాడు. బాహుబలి ముందు ప్రభాస్ కి ఒక్క సినిమా కి 15 కోట్లు దాకా రెమ్యునరేషన్ ఇస్తారని టాక్. వేరే సినిమాలు ఒప్పుకోకుండా రెండేళ్ళు బాహుబలి కోసం కష్టపడితే కేవలం 20 కోట్లే అంటే చాలా తక్కువ. ఇక రాజమౌళి అయితే బాహుబలి ముందే 10 కోట్ల క్లబ్బు దాటారు. ఆయన రెమ్యునరేషన్ తో పాటు లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నారని సమాచారం. 600 కోట్లు వసూలు చేసిన బాహుబలి ద్వారా నిర్మాతలకి భారీగానే లాభాలు వచ్చి ఉంటాయి. ప్రభాస్ రాజమౌళి లకి బాగానే డబ్బు ఇచ్చి ఉంటారు. ప్రభాస్ కి దాదాపు 60 కోట్ల దాకా గిట్టుబాటు అయిందని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చెప్పారు. మరి ఈ ఫోర్బ్స్ వారి లెక్కలేంటో..మరీ చీప్ గా లేవూ..
No comments:
Post a Comment