మీకు ఆయన పవర్ స్టారే కావచ్చు…నాకు మాత్రం దేవుడు: పూరి
తను
సినీ దర్శకుడిగా ఈ స్థాయికి రావడానికి మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశమే అని పలు మార్లు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలిపిన విషయం విదితమే. అయితే ఈ మధ్య పవన్ కు పూరి మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో…తాజాగా ‘లోఫర్’ ఆడియోలో పవన్ అభిమానుల సందడి కి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలకు మరింత ఊతమిచ్చాయి.
అయితే…తన మనసులోని మాటని బయటపెట్టేశాడు పూరి. లోఫర్ ప్రమోషన్ లో భాగంగా వైజాగ్ వెళ్ళిన ఆ సినిమా టీం అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన పూరి…”పవన్ కళ్యాణ్ మీకు పవర్ స్టార్ అవ్వచ్చు…కానీ మాత్రం దేవుడు” అని చెప్పుకొచ్చారు. ఈ మాటలతో పవన్ అభిమానులకు- పూరి మధ్య నడుస్తున్న మనస్పర్ధలకు చెక్ పడ్డట్లే అని చెప్పుకోవచ్చు. పూరి చేసిన వ్యాఖ్యలు అభిమానులకు సంతోషాన్నిచ్చాయి.
No comments:
Post a Comment