పూరితో ఛార్మీ సహజీవనం: ఛార్మీ కామెంట్ ఇదే
క్రేజీ డైరెక్టర్
పూరి జగన్నాథ్‌తో ఛార్మింగ్ గర్ల్ ఛార్మీ సహజీవనం చేస్తోందట. వీరిద్దరికి ఎఫైర్ కూడా ఉందంటూ తాజాగా టాలీవుడ్‌లో న్యూస్ చక్కెర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలపై ఛార్మీ స్పందించింది. పూరి తనకు గుడ్ ఫ్రెండ్ అని…ఆయనకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారని…పూరి ఫ్యామిలీతో కూడా తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పింది.
ఇటీవల జ్యోతిలక్ష్మి సినిమాతో తాను నిర్మాతగా కూడా మారడం వల్ల తాము ఎక్కువగా కలిసి ఉంటున్నామని..పార్టీలకు కూడా కలిసి వెళ్లడంతోనే ఈ పుకార్లు పుట్టించారని చెప్పింది. ఇక చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేయకుండా పూరిని తానే ఆపానని వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదని…ఈ గాసిప్స్ ఎందుకు పుట్టిస్తారో తనకు అర్థం కాలేదని ఆమె వాపోయింది.
No comments:
Post a Comment