Monday, 14 December 2015

మెగాస్టార్ 150వ సినిమా లైన్ క్లియర్

మెగాస్టార్ 150వ సినిమా లైన్ క్లియర్




గత కొద్దినెలలుగా అందని ద్రాక్ష పళ్ళలా మెగా అభిమానులును ఊరిస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా. చాలా రోజుల నుంచి ఈ 150వ సినిమా వార్తల్లోనే ఉంది కానీ ఇప్పటి వరకూ ఎలాంటి కచ్చితమైన వార్తా లేదు. దసరా కానుకగా చిరు 150వ సినిమా అనౌన్స్ చేస్తా అన్నారు కానీ అనౌన్స్ చేయలేదు. దాంతో చిరు 150వ సినిమా గత కొద్ది రోజులుగా న్యూస్ లో చక్కర్లు కొడుతోంది.అప్పట్లో తమిళ హిట్ చిరుత్రం కత్తి రీమేక్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనుకున్న టైమ్ లో మళ్లీ ఎందుకో వాయిదా వేశారు. రీమేక్ కి సంబంధించిన అధికారిక వార్త బైటికి రాలేదు. ఒకవేళ మనసు మార్చుకుని ఇంకా ఏవైనా కథలు వింటున్నారా? అన్న సందేహాలొచ్చాయి. కానీ ఇప్పుడు అన్నిటికీ లైన్ క్లియర్ అయ్యింది . రాత్రి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెంగళూరులో జరిగిన రిట్జ్ ఐకాన్ అవార్డ్స్ 2015 వేడుకకి హాజరయ్యాడు. అక్కడ ఓ మీడియా ప్రతినిధి చిరు 150వ సినిమా గురించి అడగగా ‘చిరు 150వ సినిమా కథని ఫిక్స్ చేసేసాం. తమిళ బ్లాక్ బస్టర్ కత్తి రీమేక్ లో నటించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా రేసులో ఎందరు దర్శకులు ఉన్నా.. మెగా కాంపౌండ్ నమ్మకం అంతా వి.వి.వినాయక్ పైనే. అతడి కమిట్ మెంట్ – డెడికేషన్ పై చిరుకి బోలెడంత నమ్మకం. మొదటి నుంచి ల్యాండ్ మార్క్ సినిమాకి వినాయక్ దర్శకుడు అయితేనే బావుంటుందనేది అతడి ఆలోచన. దర్శకుడు ఎప్పుడూ సమస్య కాదు. కథే అసలు సమస్య. చిరుకి నచ్చే కథే రాలేదు అంతే.

No comments:

Post a Comment