Friday, 11 December 2015

డబ్బులేక అప్పు చేసి మరీ చెన్నైకి విరాళం ఇచ్చిన ‘పవన్ కళ్యాణ్’..??

డబ్బులేక అప్పు చేసి మరీ చెన్నైకి విరాళం ఇచ్చిన ‘పవన్ కళ్యాణ్’..??12358329_996103433787067_38876465_n


డబ్బులేక అప్పు చేసి మరీ చెన్నైకి విరాళం ఇచ్చిన ‘పవన్ కళ్యాణ్’..??

చెన్నై వరద బాధితులకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై వరద బాధితుల కోసం పలువురు హీరోలు ముందుగానే స్పందిస్తే పవన్ మాత్రం ఎందుకు ఆలస్యంగా బాధితులకు సహాయం చేసాడని అటు తెలుగు ప్రజలకు, పవన్ అభిమానులకు కూడా అర్ధం కాలేదు. తాజాగా పవన్ ఆలస్యంగా విరాళం ఇవ్వడానికి కొన్ని కారణాలు తెలిసాయి.
సర్దార్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కి చెన్నై వరదల విషయం తెలిసినపుడు తన వద్ద డబ్బులు కూడా లేవటా..చాలా మంది అనుకుంటారు ‘డబ్బు నీ దగ్గర ఉండకపోవచ్చు నా దగ్గర ఉండకపోవచ్చు’ కాని పవన్ కళ్యాణ్ దగ్గర ఉండకపోవడమెంటీ అని..!! ఎవరు చెప్పిన నమ్మరు కాని ఆ సమయంలో పవన్ ఆర్థికంగా కొంత కష్టాల్లో ఉన్నదీ నిజమేనని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎకౌంటు లో కోటి రూపాయలు లేని పరిస్థితిలో ఉన్నాడని సమాచారం. ఒక స్టార్ హీరో అంటే కొన్ని కోట్ల రూపాయలు వెనకేసి ఉంటారని మనం అనుకుంటాం కాని పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు.. తన వద్దకి సహాయం కోసం ఎవరు వచ్చిన లేవనకుండా తోచిన సహాయం చేస్తుండటంతో డబ్బులు కూడా అంతగా దాచుకోలేదనే విషయం పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళకు మాత్రమే తెలుసు.
‘సర్దార్’ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఒక ఏరియాకి సంబందించిన సినిమా హక్కులను తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై వరదలకు ప్రాణ, తీవ్ర ఆస్తి నష్టాలతో రోడ్డున పడ్డ వేల మందికి బాసటగా నిలిచేందుకు తన వంతుగా కనీసం రెండు కోట్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో డబ్బులను సర్దుబాటు చేసి ఇచ్చినట్లు తెలుస్తుంది. సర్దార్ సినిమా విడుదల తర్వాత డబ్బును తిరిగి ఇస్తానని పవన్ కళ్యాణ్ ఒక స్టార్ దర్శకుడి వద్ద అప్పు కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఆ మధ్య జనసేన స్థాపించిన పవన్ తను పార్టీ పెట్టడానికి డబ్బులు కూడా లేవని ఒక బహిరంగ సభలో కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికీ వారే యమునా తీరే అనుకుంటున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇలా అప్పు చేసి మరీ ఆదుకున్నాడనే ఈ వార్త వింటుంటేనే అర్ధం అవుతుంది పవన్ కళ్యాణ్ ది దాచిపెట్టుకునే మనస్తత్వం కాదని.., పంచి పెట్టె మనసున్నవాడని అది డబ్బు అయిన, ప్రేమ అయిన..!!

2 comments:

  1. Replies
    1. బికారి కాదు ప్రేమకు ప్రతిరూపం..

      Delete