నాన్నకు ప్రేమతో రిలీజ్ డేట్… రకుల్ చెప్పేసింది
ఎన్టీఆర్ హీరోగా
సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో ఎప్పుడు రిలీజవుతుంది? ఈ విషయంలో క్లారిటీ మిస్సయ్యింది. చిత్రయూనిట్ అధికారికంగా ఎట్టి పరిస్థితిలో 2016 సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని ప్రకటించింది. ఓ వైపు బాబాయ్ బాలయ్య డిక్టేటర్ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో నాన్నకు ప్రేమతో డిక్టేటర్‌కు పోటీ వస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. అయితే ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి బరిలోనే వచ్చేస్తున్నాం. జనవరి 13 న మా సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
నాన్నకు ప్రేమతో సంక్రాంతి కానుకగా జనవరి 13నే వస్తుందని హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. రిలీజ్ డేట్ విషయాన్ని రకుల్ తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవలే ఈ ఈ చిత్రయూనిట్ స్పెయిన్ నుంచి వచ్చింది. వస్తూనే నిర్మాణానంతర పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆ పనులన్నీ జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. ఇక దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి ఇటీవలే మృతి చెందారు. దేవి ఆ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని వచ్చి ఈ సినిమాకు బ్యాలెన్స్ వర్క్ పినిష్ చేయనున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రకుల్ కూడా క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంక్రాంతికి తమ అభిమాన హీరో థియేటర్లలో హంగామా చేయడంతో వాళ్లకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తోంది. రకుల్ కూడా కిక్ 2, బ్రూస్‌లీ ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది.
No comments:
Post a Comment