రానా మాజీ లవర్‌పై చీటింగ్ కేసు
ప్రముఖ కన్నడ సినీనటి
రాగిణి ద్వివేదిపై మంగళవారం జేపీ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ‘నాటికోలి’ సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్ కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నాని హీరోగా వచ్చిన ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో రాగిణి నటించిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ భళ్లాళదేవుడు దగ్గుపాటి రానాతో ఆమె కొద్ది రోజుల పాటు ఎఫైర్ నడిపినట్టు కూడా టాలీవుడ్‌లో వార్తలు పుకార్లు …షికార్లు చేశాయి.
No comments:
Post a Comment