Wednesday, 9 December 2015

అమీర్‌ఖాన్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అల్లుడేనా..!



అమీర్‌ఖాన్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అల్లుడేనా..!

alludu

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఇటీవ‌ల మ‌త అస‌హ‌నంపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు అంద‌రి దృష్టి ఆయ‌న భార్య కిర‌ణ్‌రావ్‌పై ప‌డింది. దేశంలో మ‌త అస‌హ‌నం ఎక్కువైపోతోంద‌ని…మ‌నం దేశం విడిచి వెళ్లిపోదామ‌ని త‌న భార్య అన్న‌ట్టు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అమీర్‌ చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టి కిరణ్‌రావుపైకి మళ్లింది. కిరణ్‌ రావుకు తెలంగాణతో దగ్గరి బంధమే ఉంది. కిరణ్‌ తాతగారు(తండ్రి వైపు) మహబూబ్‌నగర్‌లోని వనపర్తి రాజవంశీకులు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన కిరణ్‌ తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరు, కోల్‌కతా, ముంబైల్లో పనిచేశారు. అయితే అమీర్ ల‌గాన్ సినిమాకు కిర‌ణ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ప్రేమ‌గా మారి వీరు పెళ్లి చేసుకున్నారు.
 కిర‌ణ్‌తో ప్రేమ‌లో ప‌డ్డాకు అమీర్ 2002లో ఆమీర్‌ తన తొలి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చాడు. అమీర్‌ నటించిన దిల్‌ చాహతా హై చిత్రంలో చిన్న పాత్రలో కిరణ్‌రావు కనిపిస్తారు. అమీర్‌-కిర‌ణ్ దంప‌తుల‌కు ఒక కుమారుడు ఆజాద్ ఉన్నాడు. కిరణ్‌రావు 1973 నవంబరులో బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రావు, ఉమ ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. అంటే అమీర్ మ‌న తెలుగు రాష్ర్ట‌మైన తెలంగాణ‌కు అల్లుడ‌న్న మాట‌.

No comments:

Post a Comment