Monday, 28 December 2015

రజనీకాంత్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు...ఫుల్ హ్యాపీ

 రజనీకాంత్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు...ఫుల్ హ్యాపీ

చెన్నై : రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆయన ఎదుటివారి ఎమోషన్స్ ని గుర్తించి గౌరవిస్తూంటారు. వారి కోసం , వారి ఆనందం కోసం తన సమయాన్ని వెచ్చిస్తూంటారు. రీసెంట్ గా అమీ జాక్సన్ కోసం ఆయన ప్రత్యేకంగా సమయం వెచ్చించి ఆశ్చర్యపరిచారు. ఆ విషయాన్ని ఆమె ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటోంది. రజనీ ఎందుకు సూపర్ స్టార్ అయ్యారో అర్దమవుతోంది అని చెప్తోంది. వివరాల్లోకి వెళితే... సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘2.ఓ'లో అమీ హీరోయిన్ గా ఎంపికైంది. ఆ ఆనందంలో మునిగి తేలుతుండగానే.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో సర్‌ప్రైజ్‌నిచ్చారు. క్రిస్మస్‌ సందర్భంగా ‘2.ఓ' షూటింగ్ స్పాట్‌లోనే ప్రత్యేక సంబరాలు చేశారు రజనీకాంత్‌.


ఎమీ జాక్సన్‌ కోసం ఓ కేక్‌ను తెప్పించి.. యూనిట్‌ మధ్యలో కట్‌ చేయించారు. అందరూ కేక్‌ తినిపించి ఎమీకి శుభాకాంక్షలు తెలిపారు. సంబరాల్లో స్వయంగా రజనీకాంత్‌ పాల్గొనడంతో ఎమీ ఆనందానికి అంతే లేకుండా పోయిందట. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలోని ‘మదరాసపట్టిణం' ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ బ్రిటీషుభామ ఎమీ జాక్సన్‌. ఆమె ఈ సంవత్సరాన్ని మరిచిపోరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఈ ఏడాదిలోనే విక్రంతో చేసిన ‘ఐ' విడుదలైంది. ధనుష్‌తో నటించిన ‘తంగ మగన్‌' తెరకెక్కింది. మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తమిళ సిని వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అమీ ఆడ రోబో గా కనిపించనుంది. అయితే అది నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై మీడియా వారు ఆమె ను ప్రశ్నించారు. దానికి ఆమె స్పందించింది. అమీ జాక్సన్ మాట్లాడుతూ... ప్రస్తుతం ‘రోబో-2' లో చేస్తున్నా. ఇందులో రోబోగా నటిస్తున్నానా? లేదా? అనే విషయం ఇప్పుడు చెప్పలేను. ‘ఐ' తర్వాత మళ్లీ శంకర్‌ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది''అని పేర్కొంది.

please share it..

No comments:

Post a Comment