పెళ్లంటే నూరేళ్ల పంట.. ఒకరికొకరు జీవితాంతం కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామంటూ ఏడడుగులు నడుస్తారు.. భారతదేశ సంప్రదాయాలను, ఆచారాలను ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకుంటారు. అయితే రానురాను ఆధునిక ప్రపంచంలో మారుతున్న సాంకేతిక ప్రభావమో ఏమిటో తెలియదు గాని సంప్రదాయాలకు విలువలు తగ్గుతున్నాయనేది మాత్రం వాస్తవం. ఇంతకీ అసలు విషయం ఏమంటే… లైఫ్ రొటీన్‌గా మారి బోర్ కొట్టేసిందనే కారణంతో పెళ్లై పదేళ్లయిన బుల్లితెర జంట విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారట. ఇంతకీ ఆ జంట ఎవరో వివరాల్లోకి వెళ్తే…
ఎమ్ టీవీ స్టార్ కపుల్ రఘురాం, సుగంధ గార్గ్ పది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కలిసి ఉన్న వీరిద్దరికి లైఫ్ రొటీన్ గా మారి బోర్ కొట్టేసిందని, ఎవరి బతుకు వారే బతికితే హాయి అనుకుని నిర్ణయానికి వచ్చి విడాకులకు అప్లై చేశారట. పైగా భార్య భర్తలుగా కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా అని ఈ నిర్ణయానికి వచ్చారట. హాయిగా విడాకులు తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. భార్య భర్తలుగా మేం విడిపోయినా.. ప్రెండ్స్ గా ఉంటామని చెప్పారు. వీరిద్దరి అభిప్రాయం విన్న వారు ఇదేమి విచిత్రమని అవాక్కవుతున్నారు.
please share it..
No comments:
Post a Comment