Sunday, 10 January 2016

ధోనీ దుకాణం బంద్ : నీ సేవ మాకొద్దు

dhoni-12012

జార్ఖండ్ డైన‌మైట్ మ‌హేంద్ర సింగ్ ధోనికి ఇక రోజులు చెల్లిన‌ట్లే! ఇప్ప‌టికే టెస్ట్ క్రికెట్ సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న ఆయ‌న‌, ఇక వ‌న్డేల‌పైనా ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే!వ‌న్డేల‌కు రైనా అయితేనే సూట్ అవుతాడ‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్నారు.ఆయ‌న దూకుడు వ‌న్డేలే కచ్ఛితంగా సూట్ అవుతాయ‌న్న‌ది సెల‌క్ట‌ర్ల వాద‌న‌.టీం ఇండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్ అందించ‌డంతో స‌హా ఎన్నో విజయాలను సొంతం చేసిన ఘ‌న‌త ధోనీకి ఉన్నా.. ఇటీవ‌ల ఆయ‌న తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయ్‌.వ‌రుస ఓట‌ములు ఆయ‌న సార‌థ్యాన్ని సంకించేలా చేస్తున్నాయ్‌.దీంతో “ఇక చాలు..బాబు నీ సేవ‌లు ” అనే స్థాయికి ఆయ‌న దిగ‌జారిపోయాడు.విజ‌యాలెన్నో.. వివాదాలూ అన్నే.. అన్న త‌ర‌హాలో ఆయ‌న మారిపోయాడు.
దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు వన్డేలు, మూడు ట్వంటీ – 20 మ్యాచ్ లకు భారత సారథిగా విరాట్ కోహ్లీకి ప‌గ్గాలు అందించేందుకు సెలక్టర్లు మొగ్గుతున్నారు.(అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 7 వరకు 72 రోజుల పాటు టీం ఇండియా ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టించ‌నుంది)
ఇక‌పై ట్వంటీ – 20 కే ప‌రిమితం : చాలు.. చాలు.. చాలు..
ఏదేమైనా / ఆరు నూరైనా.. నూరు నూట ఆరైనా../ ఇక‌పై ధోనిని ఆట‌గాడిగానే కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు.ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్‌లో విరాట్ కోహ్లీ తానెంటో నిరూపించుకున్నాడు.దీంతో ఒకే జ‌ట్టు రెండు విభిన్న శైలి ఉన్న కెప్టెన్లు ఉండ‌డం అంత మంచిది కాద‌ని సెల‌క్ట‌ర్లు ఓ నిర్ణ‌యానికివ‌చ్చారు.అంతేకాదు వచ్చే సంవత్సరం జరిగే ట్వంటీ – 20 ప్రపంచకప్ వరకూ వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినివ్వాలని ఇప్పటికే బీసీసీఐ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ని ఇవాళ ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది.ధోనిని కేవలం ట్వంటీ – 20 ఫార్మెట్‌కు పరిమితం చేసి వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా కోహ్లీని కొనసాగించే భావనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.మొత్తానికి ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌కు బీసీసీఐ నుంచే కాదు అభిమానుల నుంచి కూడా అక్షింత‌లు ప‌డ‌క త‌ప్పేలా లేదు.
please share it..

No comments:

Post a Comment