సెక్స్‌రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తారా చౌదరి అంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారు ఉండరేమో.. ప్రకాశం జిల్లా నుంచి సినిమాల మీద మోజుతో హైదరాబాద్ వచ్చిన ఆమె ఆ మధ్యకాలంలో వార్తల్లోకి ఎక్కి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇంతకీ అసలు విషయం ఏమంటే.. తారా చౌదరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆమె వదిన కవిత ఆరోపించారు. తారాచౌదరి ఆమె సోదరులు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో కవిత మీడియాతో మాట్లాడారు. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని ఆమె విన్నవించారు. తనను చంపుతానని తారాచౌదరి బెదిరిస్తుందని కవిత పేర్కొన్నారు. ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని పిలిచి తనను కొడుతున్నారని, జుట్టు కూడా పీకుతున్నారని ఆమె ఆరోపించారు. తిండికూడా తిననివ్వకుండా టార్చర్ పెడుతున్నారని కవిత విలపిస్తూ చెప్పారు. వీరి నుంచి దూరంగా వెళదామనుకున్నప్పటికీ, తారా చౌదరి గురించి తెలిసినవారంతా తమను రానివ్వడం లేదన్నారు. ఏదేమైనా కొద్ది రోజుల వరకు పెద్ద సంచలనం రేపి కాస్త సైలెంట్ అయిన తార ఇప్పుడు మళ్లీ ఇలా వార్తల్లోకెక్కింది.
please share it..
No comments:
Post a Comment