Friday, 6 November 2015

స్వాతి త్రిపుర సినిమా ఎలా ఉందంటే


స్వామి రారా ,కార్తికేయ వంటి వరుస విజయాలతో యమా స్పీడ్ గా ఉన్న కలర్స్ స్వాతి తాజాగా నటించిన చిత్రం ''త్రిపుర ''. గీతాంజలి వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా మారిన రాజ్ కిరణ్ త్రిపుర చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి . దానికి తోడూ హర్రర్ కామెడీ చిత్రం కావడంతో బిజినెస్ కూడా జోరుగా సాగిందట . హర్రర్ చిత్రాలకు ఆదరణ లభిస్తుండటంతో త్రిపుర పై భారీ ఆశలు పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు . ఇక హీరోయిన్ స్వాతి ,హీరో నవీన్ చంద్ర అయితే త్రిపుర పై గట్టి నమ్మకంతో ఉన్నారు అయితే ఈరోజు రిలీజ్ అయిన త్రిపుర చిత్రానికి అంతగా పాజిటివ్ టాక్ రాలేదు ,సినిమా కొంత భయపెడుతూ ,మరికొంత నవ్విస్తున్నప్పటికి ఓవరాల్ గా కథలో కొత్తదనం లేకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు . స్వాతి నటన తో ఆకట్టుకున్నప్పటికి ,దర్శకుడిగా రాజ్ కిరణ్ ఫరవాలేదని పించినప్పటికి కథలో మరింత దమ్ము ఉంటే తప్పకుండా త్రిపుర సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు ప్రేక్షకులు . అయితే త్రిపుర సినిమా మరీ తీసి పడేయతగ్గ సినిమా అయితే కాదు కానీ   ...... ...... ..... అలాగని  గొప్ప హిట్ కాదు .

No comments:

Post a Comment