Thursday, 5 November 2015

శంకర్ కు చుక్కలు చూపిస్తున్న ఆర్నాల్డ్


plz.. visit the side ads.. for best deals..

'ఐ' సినిమా ఫెయిల్యూర్ తో ఢీలా పడ్డా  శంకర్..తన పవర్ ఏంటో  ప్రూవ్ చేసుకోవడం కోసం మరోసారి  కష్టపడుతున్నాడు. రజనీకాంత్ తో తెరకెక్కించిన  'రోబో' సినిమాకు సీక్వెల్ గా  రోబో 2 ను రూపోందించే పనిలో బిజీగా అయిపోయాడు దర్శకుడు శంకర్. ఈ చిత్రాన్ని ఇండియా కే పరిమితం కాకుండా హాలీవుడ్ స్టాండట్స్ తో తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ టాప్ టెక్నిషియన్స్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు..ఇప్పుడు ఆ నిర్ణయాలే ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి..రోబో 2 లో  హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్  విలన్ గా నటిస్తే..వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఆయనతో సంప్రదింపులు జరిపారు..అయితే ఆర్నాల్డ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో పాటు , కొన్ని కండిషన్స్ పెట్టాడని తెలుస్తోంది..ఆయన అడిగిన  రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి  అభ్యంతరం లేకపోయినా..ఆయన పెట్టిన కండీషన్స్ చిత్రయూనిట్ కు చిరాకును తెప్పిస్తున్నాయట..ఆయన రోబో 2 లో నటించడానికి 50 రోజుల కాల్ షీట్స్ అవసరం..కానీ అర్నాల్ మాత్రం 36 రోజులు డేట్స్ మాత్రమే ఇస్తానన్నాడట..అంతేకాకుండా హాలీవుడ్ రైటర్స్ తో మార్పులు చేయించాలని కండిషన్ పెట్టాడట..సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపోందుతున్న ఈ చిత్రానికి ఆర్నాల్డ్ రూపంలో కొత్త ట్విస్ట్ లు ఎదురయ్యే సరికి ఈ ప్రాజెక్ట్ ను సెట్ప్ పైకి ఎలా తీసుకెళ్లాలో  తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడట శంకర్..మరి ఫైనల్ గా విలన్ ను మారుస్తాడో..లేక ఆర్నాల్డ్ కండిషన్స్ ను  ఫాలో్ అవుతాడో వేచి చూడాలి..

No comments:

Post a Comment