Thursday, 5 November 2015

టాలీవుడ్ లో మరో ' శ్రీమంతుడు '


plz.. visit the side ads.. for best deals..

సూపర్ స్టార్ మహేష్ బాబు .. రీల్ లైఫ్ ను ,రియల్ లైఫ్ లోను శ్రీమంతుడు అనిపించుకున్న సంగతి తెలిసిందే..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సినీ ,రాజకీయ ప్రముఖులు వెనుకబడిన గ్రామాలను దత్తతు తీసుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు..మహేష్ బాబు తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపురం గ్రామాన్ని, ఎపీ నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదే బాటలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నడిచాడు. తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పటికే పనులు షూరు చేశాడు..వీరి లిస్ట్ లోకి సీనియర్ నటుడు  సుమన్ కూడా చేరబోతున్నాడు..తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన సుమన్ ..మహబూబ్ నగర్ జిల్లా, మాడుగుల మండలం, సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకో బోతున్నట్లు తెలుస్తోంది . త్వరలోనే ఈ విషయాన్ని సుమన్ అధికారికంగా ప్రకటించనున్నాడని సమాచారం..ముందుముందు ఇంకెంత మంది నటులు టాలీవుడ్ నుంచి శ్రీమంతులు అవుతారా చూడాలి.

No comments:

Post a Comment