సేవా కార్యక్రమాల్లో , ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడం లో ముందుండే వారిలో తెలుగు పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే తమిళనాడు లోని 9 జిల్లాలు భారీ వర్షాలతో అతల కుతలం అవుతున్నా , చెన్నై మహా నగరం మొత్తం నీట మునిగి అక్కడి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం చర్చనీయ అంశంగా మారింది ఇప్పుడు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు. మరికొందరు క్షేత్ర స్థాయిలోని భాధితుల వెళ్ళి నేరుగా ఫుడ్ , మెడికల్ సప్లిస్ ,వాటర్ అందిస్తున్నారు. మరికొందరు స్టార్స్ చెన్నై కోసం అంటూ విరాళాలు సేకరిస్తున్నారు.గతంలో హుదుద్ తుఫాన్ సమయంలో అందరికంటే ముందు స్పందించిన పవర్ స్టార్
ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ " "సర్దార్ గబ్బర్ సింగ్ " షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. మరి షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల సైలెంట్ గా చెన్నై సహాయానికి సంబందించి తన పని తానూ చేసుకుపోతున్నారా ? లేక ఇంకేదైనా కారణం ఉందా ? అనేది తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment