Monday 14 December 2015

తెలియక చేసిన పొరపాటుకు 10 కోట్లు వచ్చి పడ్డాయి..!

తెలియక చేసిన పొరపాటుకు 10 కోట్లు వచ్చి పడ్డాయి..!










అదృష్టం అనేది ఏ రూపం లో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అలానే ఓ వ్యక్తి చేసిన చిన్న పొరపాటు అతని పాలిట లక్ష్మి దేవి చేరింది. ఆ వివరాలలోకి వెళితే..  బ్రిటన్ లో స్టాన్ ఫోర్డ్ షైర్ కు చెందిన స్టూవర్ట్ పావెల్ అనే వ్యక్తి లారీలను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. తనకున్న అలవాటుతో ఓ లాటరీ టికెట్ ను కొనేందుకు వెళ్లి.. ఆ రోజు అడిగిన టికెట్ కాకుండా.. తెలియక పొరపాటున షాపు యజమాని మరో రోజున డ్రా ఉన్న టికెట్ ను ఇచ్చాడు. పావెల్ కుడా చూసుకోకుండా ఇంటికి తీసుకు వచ్చేశాడు.
ఆపై ఫలితాల రోజు షాపు యజమానిని తిట్టుకున్నాడు కూడా. తిరిగి తన చేతిలోని లాటరీ టికెట్ కు  ఆపై ఆ టికెట్ కు మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 10 కోట్లు బహుమతి లభించిందని భార్య చెబితే విని ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఏమైనా షాపు యజమాని చేసిన పొరపాటు పావెల్ కు అదృష్టాన్ని దగ్గర చేసింది. ఈ డబ్బుతో కొడుకులకు ఇళ్లు కొంటానని.. తన చిరకాల కోరికలు నెరవేర్చు కుంటారని ఇప్పుడు పావెల్ అంటున్నాడు.

1 comment: