Thursday, 24 December 2015

చిరంజీవి 150 వ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

చిరంజీవి 150 వ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

చిరంజీవి 150వ చిత్రాన్ని వి వి వినాయక్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్  'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ఇటీవలే రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కత్తి చిత్రాన్ని తమిళం లో నిర్మించిన లైక ప్రొడక్షన్స్ సంస్థ తో పాటు రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఇదే లైక ప్రొడక్షన్స్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజిని కాంత్ తప్ రోబో 2. 0 ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రజిని కాంత్ కు 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.అయితే లైక ప్రొడక్షన్స్  వారు  చిరంజీవి 150 వ  చిత్రానికి ఆయనకు 30 కోట్ల రెమ్యూనరేషన్ ను రజిని కాంత్ కు సమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన  'ఘరానా మొగుడు'  1992 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ  చిత్రం తర్వాత  టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ లలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకున్నారు. 'ఘరానా మొగుడు' చిత్రానికి చిరంజీవి   తీసుకున్న రెమ్యూనరేషన్ కోటి 25 లక్షలు, ఇంత ఎమౌంట్  అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ కావడం విశేషం.

No comments:

Post a Comment