Wednesday, 9 December 2015

బాహుబ‌లి న‌చ్చ‌లేద‌న్న స్టార్ డైరెక్ట‌ర్‌

బాహుబ‌లి న‌చ్చ‌లేద‌న్న స్టార్ డైరెక్ట‌ర్‌


bahu

దేశ‌వ్యాప్తంగా ఎంతోమందిని మెప్పించ‌డంతో పాటు టాలీవుడ్ స‌త్తాను ఇండియా వైజ్‌గా చాటిన జ‌క్క‌న్న విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సినిమా ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌కు న‌చ్చ‌లేద‌ట‌. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ  బాహుబ‌లి వంటి సినిమాలు త‌న‌కు నిజంగా న‌చ్చ‌వ‌న్నారు. తాను ఫాంటసీ కథలకు అభిమానిని కాద‌ని… టీవీలో కూడా గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ వంటివి కాకుండా మహిళా సీరియళ్లే ఇష్టపడతాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. గౌత‌మ్ మీనన్ ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేస్తున్నాడు.
 బాహుబ‌లి సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా దాదాపు రూ. 650 కోట్ల వసూళ్లు సాధించి సౌతిండియా సినిమా పరిశ్రమలో స‌రికొత్త రికార్డులు సృష్టించింది. బాహుబ‌లి చూసిన వారంతా బాహుబ‌లి రెండో పార్ట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి హిట్ ఇచ్చిన రాజ‌మౌళిని, హీరో ప్ర‌భాస్‌ని అనేకమంది మెచ్చుకుంటూనే ఉన్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ కూడా జ‌క్క‌న్న టీంను అభినందించాడు. కానీ  దర్శకుడు గౌతమ్ మీనన్ మాత్రం త‌న మ‌న‌సులోని మాట‌ను నిర్భ‌యంగా చెప్పేశారు. వాస్త‌వానికి బాహుబ‌లి సినిమా ఫ‌స్ట్ రోజున విమ‌ర్శ‌కుల తిర‌స్క‌ర‌ణ‌కు గురైనా త‌ర్వాత పుంజుకుని మంచి వ‌సూళ్లు సాధించింది.

No comments:

Post a Comment