Sunday 10 January 2016

కేసీఆర్ కు”మెట్రో రైల్”ఫ్రీ పబ్లిసిటీ ??

045050120110

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెల రోజుల నుంచే నగరంలోని హోర్డింగ్స్ అన్నింటినీ కబ్జా చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ… కొద్ది రోజుల క్రితమే మెట్రో రైల్ పిల్లర్లను కూడా తమ ప్రచారానికి వాడుకుంటున్న సంగతి తెలిసిందే. మొత్తం వెయ్యి పిల్లర్లపై టీఆర్ఎస్ ఫ్లెక్సీలు నగరం మొత్తం దర్శనమిస్తున్నాయి. అయితే మెట్రో రైల్, ఎల్ అండ్ టి తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నాయి. తాము కొన్ని పిల్లర్ల తమ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఎన్ని సార్లు మెట్రో రైల్, ఎల్ అండ్ టి అధికారులను కోరినా స్పందించలేదని… అలాంటి టీఆర్ఎస్ కు ఏకంగా వెయ్యి పిల్లర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎలా కల్పిస్తారని కాంగ్రెస్ ముఖ్యనేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ నేతలు సైతం మెట్రో రైల్, ఎల్ అండ్ టి అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఇందుకోసం వారి ఎంత తీసుకున్నారనే విషయాన్ని పక్కనపెట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు నేతలైతే… మెట్రో రైల్, ఎల్ అండ్ టి సంస్థ టీఆర్ఎస్ కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి అదనపు ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన మెట్రో రైల్, ఎల్ అండ్ టి ఉన్నతాధికారులు… తమను ఈ విషయంలో టీఆర్ఎస్ కంటే ముందు ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు పిల్లర్లపై ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి మెట్రో రైల్, ఎల్ అండ్ టి సంస్థకు టీఆర్ఎస్ ఎంత చెల్లించిందనే విషయాన్ని తాము చెప్పలేమంటూ పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించినట్టుగా వ్యాఖ్యానించారు. మొత్తానికి… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెట్రో రైల్, ఎల్ అండ్ టి గులాబీ పార్టీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
please share it..

No comments:

Post a Comment