Sunday, 10 January 2016

ఆన్ లైన్లో పందెం కోళ్ళ సేల్

08801450410

ఆధునిక ప్ర‌పంచంలో ఏ వ‌స్తువు కొనాల‌న్నాఇంట్లో కూర్చుని ఆన్‌లైన్లో షాపింగ్ చేసే క‌ల్చ‌ర్ ఎక్కువ మందికి అల‌వాటైంది. ఆన్‌లైన్ షాపింగ్ జోరుగా విస్త‌రించ‌డంతో ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండానే త‌మ‌కు ఎలాంటి వ‌స్తువు కావాలన్నా ఇంట్లోనుంచే కొనేసుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్ దెబ్బ‌కు రిటైల్ బిజినెస్‌కు భారీగానే గండిప‌డుతోంది. ఇప్పుడు తాజాగా కోడి పందాల విక్ర‌య‌దారులు కూడా ఆన్‌లైన్ బిజినెస్‌కు తాము కూడా రెఢీ అంటున్నారు. పండుగకు నెల రోజుల ముందు నుంచే పందెం కోళ్ల విక్రయాలు మొదలయ్యాయి. వీటిపై నిఘా పెరగడంతో కోళ్ల విక్ర‌య‌దారులు కూడా ఆన్‌లైన్ విధానాన్నే అనుసరిస్తున్నారు.
స‌హ‌జంగా పందెం వేసే వాళ్లు పుంజులు భారీగా ఉండాలి.. మంచి శరీర సౌష్టవం ఉండాల‌ని కోరుకుంటారు. అప్పుడే వాటికి గిరాకీ ఎక్కువ. అందుకే వాటికి మాంసాహారం, బాదంప‌ప్పు, జీడిపప్పు పెట్ట‌డ‌మే కాకుండా ప్ర‌తిరోజు చెర్వులో ఈత‌కొట్టించి చక్కటి ఆకృతి వచ్చేలా చేస్తుంటారు కోళ్ల‌ను అమ్మేవారు. సంక్రాంతి వ‌స్తుందంటే చాలు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఏపీలోని పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పందెం కోళ్లను పెద్ద సంఖ్యలో పెంచి విక్రయిస్తుంటారు. ఇప్పటివరకూ పందెం రాయుళ్లు నేరుగా కోళ్లను పెంచే వారి వద్దకు వెళ్లి ఆ కోళ్లను పరిశీలించి కొనుగోలు చేసేవారు. ఇటీవల కాలంలో పోలీసుల నిఘా పెరగడంతో కొంతమంది ఏకంగా పందెం కోళ్లను కూడా ఆనలైన్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్లో పందెం కోళ్లు కనిపిస్తున్నాయి. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కో పందెం కోడి ధర రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయంటే న‌మ్మండి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని కొంతమంది తమ ఫోన నెంబర్లతో సహా కోళ్ల ఫొటోలను సైట్లో పెట్టారు. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 
please share it..

No comments:

Post a Comment